11, జనవరి 2010, సోమవారం

తెలంగాణా రాష్ట్ర రోడ్ చిత్రం





తెలంగాణా రాష్ట్ర సాధనకై మనమందరం పోరాటాన్ని ఉదృతం చేద్దాం రండి......
మన రాష్ట్రం......మన పాలన......
జై తెలంగా....జై జై తెలంగాణా.....

తెలంగాణ మాతృ గీతం





మాతృ గీతం రచన: అందెశ్రీ

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

|| జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం

|| తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ

|| జై…||

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్

|| జై…||

జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం

|| జై… ||

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద

|| జై…||

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

తెలంగాణా ప్రతిజ్ఞ......







మన తెలంగాణా మాకు వచ్చాక మనం  చేసే ప్రతిజ్ఞ 
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

జై తెలంగాణా....జై జై తెలంగాణా......
జై హింద్...

9, జనవరి 2010, శనివారం

ఓలి పాలు ఓలికమ్మ.....



మన తెలంగాణా తల్లి పాలు తాగుతూ...
మన గడ్డ మీద మనల్నే పాలిస్తూ.....
మనల్ని అనిచివేస్తూ....మన గుండెల మీద తన్ని
వెనకేస్కున్న సొమ్ము ఎవడబ్బసొమ్ము......
మీ తల్లిదండ్రులు సంపాదించారా....లేక మీ మామలు సంపాదించారా.....
దమ్ముంటే మీకు మా తెలంగాణా గడ్డమీద ఎంతెంత అస్తులున్నాయో.....
అవి ఎలా సంపాదించారో.....లెక్క తేల్చండి........
అప్పుడు మేము కూడా సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉంటాము......


జై తెలంగాణా....జై జై తెలంగాణా....

జై తెలంగాణా....



అమరులైన తెలంగాణా వీరుల
ఆత్మబలం, గుండె దైర్యం , కలగలసిన పుణ్య భూమి మన వీర తెలంగాణా......
ఈ తెలంగాణా రాష్ట్రం మన కష్టం
వీరుల రక్తపు బొట్టులా త్యాగఫలం,
అన్ని కుల, మతాలకు అతీతంగా పాలిద్దాం
స్వర్డ రాజకీయ ఎత్తులను తరిమి తరిమి కొడుదాం


జై తెలంగాణా.....జై జై తెలంగాణా......

8, జనవరి 2010, శుక్రవారం

అశ్రు నివాళి........




మనమంతా చేస్తున్న తెలంగాణా పోరాటంలో నీ ప్రాణాలు పోగొట్టుకున్నావు......
ఈ తెలంగాణా పోరాటం ఎంత మంది తెలంగాణా కోసం చేస్తున్నారో....
ఎంత మంది తమ స్వార్ధ రాజకీయాలకు చేస్తున్నారో ఆ భగవంతుడికే ఎరుక..
ఈ పోరాటం లో మనం గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ......
నీకు ఇవే మా పాదాభివందనం.........

జై తెలంగాణా......జై జై తెలంగాణా.....

ఏమైంది కెసిఆర్ సారూ...............




నువ్వు మొదలు పెట్టిన దీక్ష వాళ్ళ నీ ప్రాణానికి హాని జరుగుతదని,
అలా జరగకూడదని మేమంతా మా ప్రాణాలను ఫలంగా పెట్టి నిన్ను కాపాడుకున్నాము......
అందుకు ఉదాహరణ మా సహోదరుడైన కీ.శే. శ్రీకాంత్
తన ఆత్మ బలిదానం చేసాక తెలంగాణా వస్తాదనుకున్నం.....
తెలంగాణా వచ్చేసిందని సంబరాలు జరుపుకున్నాం......
ఇక వచ్చేసిన్దనుకున్న సమయంలో.....ల(జ)గడపాటి అడ్డం వచ్చే.....
నీ పోరాటం ఉదృతం చేయ్యన్న...మీ వెనుక మేమున్నాం.......
ఒకరు కాదు ఇద్దరు కాదు.....4 కోట్ల మందిమి ఉన్నాము....
అన్ని చేసి ఇప్పుడేమో ac కార్లలో, విమానల్లో డిల్లి లో గల్లిలన్ని తిరుగుతున్నావ్......
జరా మన తెలంగాణా సంగతి చుదరాదే నీకు పున్యముంటది బాంచెను.........

జై తెలంగాణా......జై జై తెలంగాణా.....

Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger