11, జనవరి 2010, సోమవారం

తెలంగాణా అభివృద్ధి అంటే ఇదేనా......



 ఉద్యమాల గడ్డ నా తెలంగాణా
ఉద్యమాలకు పునాది నా తెలంగాణా
ఉద్యమాలకు ఆయువు నా తెలంగాణా
అన్ని రకాల వనరులు ఉన్న గడ్డ నా తెలంగాణా
సిరిగల్ల నా తెలంగాణాను దోచుకోవడమే గాని....అభివృద్దికి నోచుకోవడం లేదు.....
మా పాలమూరు జిల్లాలకు వెళ్లి చుడండి.....ఒక్కొక్క ఊర్లో ఒక్కరోజు పర్యటించండి
బ్రతుకుదేరువుకని బొంబాయికి పోతున్న అమాయకులను చుడండి
అక్కడికి వెళ్లి రోడ్ల మీద కాగితాలు ఏరుకొని....చెత్త కుండిలా పక్కన పడుకుంటున్నారు
ఓ సీమంధ్ర నేతల్లారా.......ప్రాజెక్టులు ఆంధ్రకు.....పాట్లేమో మాకా???
తెల్ల దొరలూ పోయి....నల్ల దొరలూ వచ్చినా.....మా బ్రతుకులు ఇంకా చిద్రమేనా......?
ఇదేనా మీరు చేసిన అభివృద్ధి......మేము పడుతున్న తిప్పలు చుడండి....
అప్పుడు కూడా మీరు చలించకపోతే..... మీకు మా ఊర్లో తిరిగే కుక్కలకు పెద్ద తేడ ఏమి ఉండదు.....


జై తెలంగాణా....జై జై తెలంగాణా....

2 కామెంట్‌లు:

  1. బ్రతుకుతెరువు కోసం ఒక్క తెలంగాణా నుంచే కాదు ఇక్కడ ఉత్తరాంద్ర నుంచి కూడా వేలాది గా తరలి వెళ్ళి పోతున్నారు 40% యంగ్ పీపుల్ కూలీ పనులు దొరక్క వ్యవసాయపనులు లేక పోవడం తో ఆడ మగా వూల్లు హెయిద్రాబాద్ బాంబాయి చెన్నై వంటి నగరాలకు వలసలు పోతున్నారు ఇక్కడ పల్లెటూర్లలో ముసలివారు పిల్లలు మాత్రమే మిగులుతున్నారు ..తిప్పలు పెదలందరూ పడుతున్నారు..ఆంద్రా వాళ్ళు అనగానే టాటా బిర్లాల్ల సూట్లు బూట్లు వేసుకు తిరుగుతున్నారనుకొంటున్నారేమో ..మద్యతరగతి వారయితే మరీ నరకం అనుభవిస్తున్నారు..ప్రపంచీకరణ వల్ల ఆర్దికమాంద్యం వల్ల ప్రజలు కుదేలవుతున్నారు..ఒకరి పేదరికానికి ఇంకొకరిని నిందించుకొని ప్రయోజనం లేదు..దయ చేసి నూతిలో కప్పల్లా ఆలోచించడం మానెయ్యండి..తెలంగాణ వచ్చినంత మాత్రాన యెధో జరిగిపోతుందనుకుంటున్నారేమో మరో వందేళ్లు గడచినా ఈ ప్రబుత్వాలు వాటి పద్దతి మారనంతవరకు ఈ దేశం లో సామాన్యుడు ఇలాగే బ్రత్తక్క తప్పదు..

    రిప్లయితొలగించండి
  2. You will only be deluding yourself if you stay away from truth and fact.

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger