19, జనవరి 2010, మంగళవారం

తెలంగాణా మహా పాదయాత్ర.......




ఉస్మానియా విద్యార్ధి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల మహా పాదయాత్ర ప్రారంభించింది. తెలంగాణా రాష్ట్ర సమితి ( టి. ఆర్. ఎస్.) అంది స్తున్న సంపూర్ణ సహకారంతో విద్యార్థి జెఎసిరెండు బృందాలుగా విడి పోయి ఉత్తర తెలంగాణా, దక్షణ తెలంగాణా ప్రాంతాల్లోని జిల్లాల్లో పాదయాత్రను చేప ట్టింది. ఆయా జిల్లాల్లోని విద్యార్ధులు, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి చైతన్యం తెచ్చేందుకు సంకల్పించిన ఈ పాదయాత్రకు పోలీ సుల నుంచి అనుమతి లభించిందా ? లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. మహా పాద యాత్ర సందర్భంగా జిల్లాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందంటూ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణ జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికార్లకు సమాచారం అందింది.

పాదయాత్ర దారి పొడవునా విద్యార్ధుల వ్యవహారశైలిపై నిఘా వర్గాలు కన్నేసి ఉంచాలని ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి సోమవారం మహాపాద యాత్ర ప్రారంభమవు తుంది. ఒక బృందం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం మీదుగా వరంగల్ చేరు కుంటుంది. మరోబృందం రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీం నగర్ మీదుగా వరంగల్ చేరుకుంటుంది. రెండు బృందాలు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి వరంగల్ చేరు కుని అక్కడ జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. విద్యార్ధులు,ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారంతా ఈ సభలో పాల్గొనే విధంగా జెఎసి కృషి చేస్తుంది.

1 కామెంట్‌:

  1. అడిదం అప్పారావు శాస్త్రి గురించి వాడి నీతి మాలిన బ్రతుకు గురించి క్రింది లింక్ లో చూడండి.

    http://telugusimha.blogspot.com/

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger